ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Megastar Chiranjeevi - Harish Shankar combo on cards

చిరు నెక్స్ట్ నుంచి ఓదెల అవుట్-హరీష్ ఇన్

Megastar Chiranjeevi - Harish Shankar combo on cardsMegastar Chiranjeevi - Harish Shankar combo on cards



మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాల విడుదల తేదీలో మెగా కన్ఫ్యూజన్ నడుస్తుంది. దర్శకుడు బాబీ కాక ను సంక్రాంతికి విడుదల చేస్తామని ఓపెనింగ్ రోజే అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు చిరు నటించిన విశ్వంభర కి అదే సంక్రాంతి డేట్ కావాలని మేకర్స్ అడగడంతో మెగా కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. ఆ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతికి వస్తుందో అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే.

ఈలోపు మెగాస్టార్ చిరు నెక్స్ట్ మూవీ దర్శకుడు విషయంలో అందరిలో క్యూరియాసిటీ మొదలయ్యింది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా నాని నిర్మాతగా చిరు మూవీ అనౌన్సమెంట్ వచ్చేసింది. కానీ ప్యారడైజ్ రిజల్ట్ తర్వాత చిరు-శ్రీకాంత్ ఓదెల మూవీ విషయంలో అనిశ్చితి నెలకొంది. శ్రీకాంత్ ఓదెల తో చిరు మూవీ ఇప్పట్లో కాదు అసలు లేనట్లే అనే ప్రచారం మొదలైంది.

ఈలోపు డిజాస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మెగాస్టార్ తదుపరి మూవీ అనే వార్త వైరల్ అవుతుంది. మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సైలెంట్ గా ఉన్న హరీష్ శంకర్ మెగాస్టార్ చిరుకి కథ చేపి ఒప్పించారని, కాక తర్వాత చిరు హరీష్ శంకర్ డైరెక్షన్ లోనే మూవీ చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. 
 

Harish Shankar and Megastar Film Updates