అసలు నిజం బయటపెట్టిన మోహన్‌లాల్ డూప్!
Jailer 2: Chethan confirms Mohanlal performed the climax car sceneసూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన `జైలర్ 2` చిత్రంలో మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ పాత్రకు సంబంధించి సోషల్ మీడియాలో చెలరేగిన వివాదంపై బాడీ డబుల్‌గా పనిచేసిన జోబీ కొడకర స్పందించారు. సినిమాలో మోహన్‌లాల్‌కు బదులుగా తన ముఖాన్ని ఉపయోగించారంటూ వస్తున్న వార్తలను ఆయన పూర్తిగా ఖండించారు. చిత్రంలో కేవలం తన చేతులు, కాళ్లకు సంబంధించిన ఒకటి రెండు షాట్లు మాత్రమే వాడారని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై జోబీ మాట్లాడుతూ... క్లైమాక్స్ సన్నివేశంలో విమానాశ్రయం వద్ద కారు డ్రైవింగ్ చేసేటప్పుడు గేర్ మార్చడం, యాక్సిలరేటర్ తొక్కే సన్నివేశాల్లో మాత్రమే తన చేతులు, కాళ్లు కనిపించాయని తెలిపారు. సమయాభావం .. షెడ్యూల్ సమస్యల వల్ల మాత్రమే తనను ఉపయోగించి ఉంటారని, అంతే తప్ప తన ముఖం సినిమాలో ఎక్కడా చూపించలేదని వెల్లడించారు. సినిమా విడుదలైన రోజు సెట్స్‌పై మోహన్‌లాల్ గెటప్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే తాను చేసిన పెద్ద పొరపాటని, దానివల్లే ఈ వివాదం మొదలైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక `జైలర్ 2` బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. రజనీకాంత్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 540 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
















































