ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Prabhas Fans Frustrated Over Fauzi Silence

ప్రభాస్ ఫ్యాన్స్ లో అసహనం!

Prabhas Fans Frustrated Over Fauzi SilencePrabhas Fans Frustrated Over Fauzi Silence

 

మరో రెండు రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే. అక్టోబర్ 23 అంటే ప్రభాస్ ఫ్యాన్స్ కి సంబరాలే సంబరాలు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ లో ఉత్సహానికి తోడు అసహనం తాండవిస్తుంది. కారణం ఫౌజీ మేకర్స్ నుంచి బర్త్ డే స్పెషల్ అప్ డేట్ ఏమిటో అనేది బయటకి రాకపోవడమే. దసరా రోజు ప్రభాస్ బర్త్ డే కి ఇవ్వబోయే ట్రీట్ కి సంబందించిన అప్ డేట్ ని ఆశించారు వారు.

కానీ ఫౌజీ మేకర్స్ దసరా ని లైట్ తీసుకున్నారు. ప్రభాస్ బర్త్ డే కి ఫౌజీ గ్లింప్స్ వస్తున్నాయని అంటున్నా మేకర్స్ నుంచి కన్ఫర్మేషన్ లేకపోవడమే వారిలో ఈ అసహనానికి కారణం. అసలే డిసెంబర్ 3 నుంచి సినిమాని పోస్ట్ పోన్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారో, కొత్త డేట్ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టి చంపుతున్నారు.

ఇప్పుడు బర్త్ డే ట్రీట్ అప్ డేట్ ఇవ్వకుండా పరీక్ష పెడుతున్నారు అనేది ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన. ఫౌజీ గ్లింప్స్ వస్తాయి, అది బర్త్ డే కి రావడం పక్కా అంటున్నా అది అధికారికంగా చెబితేనే ఫ్యాన్స్ కుదురుకుంటారు. అన్నట్టు వచ్చే ఏడాది మార్చి 18 న ఫౌజీ ని విడుదల చేసే ఆలోచనలో ఫౌజీ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇదైనా బర్త్ డే కి అనౌన్స్ చేస్తారో లేదో చూడాలి. 

Prabhas' fans get impatient for a reason