BB10: సృష్టి, అమన్ కు షాకిచ్చిన వైల్డ్ కార్డ్స్
BB10: Wildcard shock Srishti and Amanబిగ్ బాస్ సీజన్ 10 లో ఇద్దరు వైల్డ్ కార్డు ఎంట్రీలు మిడిల్ వీక్ లో జరిగాయి. కామనర్స్ గా అగ్నిపరీక్షలో సత్తా చాటిన అపూర్వ, మిథిలేష్ లు వైల్డ్ కార్డు లుగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హౌస్ మేట్స్ వేసిన ఓట్ల ఆధారంతో వారు వచ్చారు. పాపం రామకృష్ణ ఆ అవకాశం కోల్పోయాడు. అయితే హౌస్ లోకి వచ్చేముందు మిథిలేష్, అపూర్వ ఇద్దరూ ముఖేష్ గౌడ్, అలాగే సుధీర్ లను టార్గెట్ చేస్తూ మాట్లాడారు.
హౌస్ లోకి వచ్చాక వైల్డ్ కార్డులైన మిథిలేష్, అపూర్వలకు బిగ్ బాస్ ఓ పవర్ ఇచ్చాడు. దాని ప్రకారం కెప్టెన్సీ కంటెండర్లు గా ఉన్న ముఖేష్ గౌడ్, అమన్, ఝాన్సీ, సృష్టి లలో ఇద్దరిని తొలగించాలనగానే మిథిలేష్, అపూర్వలు సృష్టి, అమన్ లను తీసేసారు. దానితో రోహిత్ ఇంకా షాలిని వారితో గొడవపెట్టుకున్నారు. సుధీర్ తో పళ్ళు రాలుతాయంటూ అని సృష్టి అనింది, కెప్టెన్ అయితే ఎలా కంట్రోల్ లో ఉంటుంది అన్నారు.
ఇక సుధీర్ ని మాట్లాడనివ్వలేదు అని, అలాగే అమన్ కూడా కెప్టెన్సీ కి అనర్హుడు అని చెప్పగానే రోహిత్ సృష్టి, అమన్ లకు సపోర్ట్ గా మాట్లాడాడు. అక్కడ అపూర్వ, మిథిలేష్ లు, ఇంకా రోహిత్ మధ్యన ఆర్గ్యూ నడిచింది. ఆతర్వాత ముఖేష్ తో అపూర్వ, ఇంకా మిథిలేష్ తో ఝాన్సీ కలిసి కెప్టెన్సీ టాస్క్ కోసం పోటీ పడిన ప్రోమో వైరల్ అవుతుంది.
















































