ప్యారడైజ్ ట్రోల్స్-నాని ఫస్ట్ రియాక్షన్
Nani reacts to The Paradise trolls
నాని ది ప్యారడైజ్.. థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. సోషల్ మీడియాలో ఈమధ్య కాలంలో ఇన్ని ట్రోల్స్ ప్యారడైజ్ మీదే వస్తున్నాయా అనేలా ప్యారడైజ్ ని ఏకి పడేస్తున్నారు జనాలు. సినిమాలో కథ లేదు, సరైన స్క్రీన్ ప్లే లేదు, అనిరుద్ కోలీవుడ్ స్టార్స్ కి ఇచ్చినట్టుగా తెలుగు హీరోలకు BGM ఇవ్వడు, ప్యారడైజ్ కి అదే చేసాడు, శ్రీకాంత్ ఓదెల బిల్డప్ తప్ప ప్యారడైజ్ లో ఏమి లేదు అంటూ సోషల్ మీడియాలో ప్యారడైజ్ ని టార్గెట్ చేస్తున్నారు.
నాని యాక్టింగ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమి లేదు అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ప్యారడైజ్ పై వస్తున్న ట్రోల్స్ పై హీరో నాని సోషల్ మీడియా వేదికగా తనదైన స్టయిల్లో స్పందించారు. ప్యారడైజ్ పై మీ రెస్సాన్స్, రియాక్షన్లు అన్నీ నేను చూశాను. అలాగే మీరు నాకు అందించిన ప్రేమను స్వీకరించాను, అంతేకాదు మీరు చేస్తున్న సరదా ట్రోల్స్‌ను కూడా అంతే ఆస్వాదించాను.
ఇక ఆడియన్స్ ఈ సినిమాను తమ సొంత చిత్రంగా భావించిన తీరు నా హృదయాన్ని తాకింది. విమర్శకులు, సమీక్షకులు వేలెత్తిన లోపాల నుండి విషయాలు, పాఠాలు నేర్చుకున్నాను. ఈ సమయంలో మీకు ధన్యవాదాలు అని చెప్పడం తప్ప ఇంకేం చెప్పలేను. కాకపోతే మీకు ఒక యునిక్ ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో రక్తం, చెమట చిందించి ఎంతో కష్టపడి మేము ఈ ప్యారడైజ్ చేసాము.
దీనిని పండుగలా సెలెబ్రేట్ చేసుకోవాలా, లేదంటే విమర్శించడం పూర్తిగా మీ(ఆడియన్స్) చేతుల్లోనే ఉంది. ఈ సినిమా పట్ల మీరు చూపిన ఉత్సాహానికి, నాపై మీరు కురిపించిన ఆప్యాయత నన్ను ఎంతో కృతజ్ఞతా భావంతో నింపేశాయి అంటూ ట్వీట్ చేసారు.
















































