హాలీవుడ్ కి వారణాసి
SS Karthikeya says that Varanasi is a volcano!
దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గురి మొదటి నుంచి గ్లోబల్ మర్కెట్ వైపే ఉంది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత మహేష్ బాబు తో వారణాసి మూవీని స్టార్ట్ చేసిన రాజమౌళి.. ఆ చిత్రం మొదటి ప్రమోషనల్ ఈవెంట్ నుంచే హాలీవుడ్ మర్కెట్ పై ఫోకస్ చేసేలా చేసారు. ఆతర్వాత హాలీవుడ్ మీడియాకి హీరో, హీరోయిన్, విలన్ ఇంటర్వూస్, రాజమౌళి ఇంటర్వూస్ ఇలా ఎటు చూసినా హాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ పెట్టినవే.
తాజాగా రాజమౌళి కొడుకు కార్తికేయ మలయాళ యాక్టర్ ఫహద్ ఫాజిల్ నటించిన డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా వారణాసి చిత్రం పై క్రేజీ కామెంట్స్ చేసారు. వారాణసి ప్రమోషన్స్ ని చాలా గట్టిగా ప్లాన్ చేస్తాం, అలాగే వారణాసి ట్రైలర్ కూడా ఉంటుంది, అందులో ఏ డౌట్ లేదు.
ఇక వారణాసి చిత్రానికి సంబందించిన హాలీవుడ్ వెర్షన్ ని కూడా రెడీ చేసే ఆలోచనలో ఉన్నామంటూ ఎస్ ఎస్ కార్తికేయ వారణాసి నేషనల్ కాదు ఇంటర్నేషనల్, పాన్ ఇండియా కాదు, గ్లోబల్ మూవీ అంటూ క్రేజీ కామెంట్స్ చేసారు.
















































