పునరాలోచనలో మెగాస్టార్

 Will Mega Star take Mega 159 forwardWill Mega Star take Mega 159 forward


మెగాస్టార్ చిరంజీవి పునరాలోచనలో పడ్డారా అంటే.. అవుననే అంటున్నాయి ఫిలిం వర్గాలు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ కొల్లి దర్శకత్వంలో కాకా చిత్రాన్ని ఫినిష్ చేస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి టార్గెట్ గా తెరకెక్కుతుంది. కాకా, ఆతర్వాత విశ్వంభర చిత్రాలను విడుదల చెయ్యాల్సిన చిరు తదుపరి మూవీని నాని ప్రొడక్షన్ లో శ్రీకాంత్ ఓదెల తో అనౌన్స్ చేసారు.

దసరా, ప్యారడైజ్ చిత్రాల తదుపరి మూవీగా శ్రీకాంత్ ఓదెల చిరు కి ఓ లైన్ చెప్పి ఒప్పించడం, అది అనౌన్సమెంట్ వరకు రావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు ప్యారడైజ్ చిత్రానికి థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసాక చిరు పునరాలోచనలో పడ్డారని, శ్రీకాంత్ తో ముందుకు వెళ్ళాలా అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది.

అసలు ప్యారడైజ్ సినిమా విడుదలకు ముందే చిరు-శ్రీకాంత్ ఓదెల మూవీ ఆగిపోయింది అనే ప్రచారం జరిగింది. కానీ ఇపుడు మాత్రం అంటే ప్యారడైజ్ విడుదలయ్యాక చిరు ఇకపై శ్రీకాంత్ ఓదెల తో సినిమా చేసే ఆలోచన విరమించుకోవడం ఖాయమనే మాట వినబడుతుంది. 
 

What will happen to Chiranjeevi - Srikanth Odela project