అప్పుడు టాక్సిక్ - ఇప్పుడు ప్యారడైజ్

The Paradise Heads Toxic WayThe Paradise Heads Toxic Way


ఈమధ్య కాలంలో ఒక సినిమాపై ఇంతగా నెగిటివిటి రావడం అనేది చూడలేదు. అందులోను తెలుగు సినిమాపై ఇలాంటి నెగిటివిటీ చూసి చాలా కాలమే అయ్యింది. ఆగస్టు చివరిలో వచ్చిన కన్నడ డబ్బింగ్ మూవీ టాక్సిక్ పై సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ నడిచింది. టాక్సిక్ చిత్రం పై ప్రేక్షకులు ఎలాంటి నెగిటివిటి చూపించినా..

ట్రోలర్స్ అలాగే ఒక వర్గం సోషల్ మీడియా బ్యాచ్ టాక్సిక్ చిత్రంపై ట్రోల్స్ వేసి పైశాచికానందం పొందారు. ఇప్పుడు అదే మాదిరి నాని ప్యారడైజ్ పై సోషల్ మీడియా ట్రోల్స్ కనిపిస్తున్నాయి. సినిమా బాలేదు అంటే బాలేదు అనాలి, కానీ పనిగట్టుకుని కామెడీ క్లిప్స్ వేస్తూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నాని లని టార్గెట్ చేస్తూ పోస్ట్ లు వేస్తున్నారు.

నిజంగా సినిమా బాగోకపోతే బాలేదు అంతే, కానీ పనిగట్టుకుని సినిమాని బ్యాడ్ చేసేలా ట్వీట్లు వేస్తూ.. నాని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హడవిడి చేస్తున్నారు. అప్పుడు టాక్సిక్, ఇప్పుడు ప్యారడైజ్ పైనే సోషల్ మీడియాలో అంత నెగిటివిటి కనిపిస్తుంది. మరి టీమ్ కూడా ఎక్కడా అతి చెయ్యలేదు, మా సినిమా బవుంటుంది చూడండి అని, కానీ ఇలాంటి ట్రోల్స్ కావాలనే చెయ్యడమే బాధాకరం. 

The Paradise