బాలీవుడ్ హీరో కి బీఎంసీ అధికారులు షాక్

BMC officials shock to Bollywood heroBMC officials shock to Bollywood hero

 

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. అజయ్ దేవగన్ కి సంబందించిన జుహు బంగ్లాలో సెలూన్, స్పా కోసం చేప్పట్టిన నిర్మాణాలు వెంటనే ఆపేయాలంటూ.. బీఎంసీ అధికారులు అజయ్ దేవగన్ కు నోటీసులు ఇచ్చారు.

తన నివాసంలో అజయ్ దేవగన్ నిర్మిస్తున్న సెలూన్ అలాగే స్పా కోసం అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపట్టడంతో ముంబై బీఎంసీ అధికారులు అజయ్ దేవగన్ కు నోటీసులు పంపించారు. అయితే బీఎంసీ అధికారులు మాత్రం జుహూలోని హౌసింగ్ సొసైటీ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు అజయ్ దేవగన్ కు నోటీసులు ఇచ్చినట్లుగా చెబుతుంది.

కుటుంబాలు నివాసాలు ఉంటున్న సొసైటీలో ఇలా వ్యాపారాల కోసం నిర్మాణాలు చేపట్టడంపై అక్కడి సొసైటీ లో నివసించే కుటుంబాలు అభ్యన్తరం తెలపడంతో అజయ్ దేవగన్ కి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తుంది.  

BMc has issued a stop-work notice at Ajay Devgn's Juhu Bungalow