వారణాసి లుక్ నుంచి కొత్త లుక్ లోకి మహేష్

Mahesh Babu's latest rugged new lookMahesh Babu's latest rugged new look


సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి షూటింగ్ ఫినిష్ చేసేసారు. తన పార్ట్ షూట్ పూర్తి చేసి మహేష్ రిలాక్స్ అయ్యారు. ఇకపై రాజమౌళి పోస్ట్ ప్రొడక్షన్, వి ఎఫ్ ఎక్స్ కోసమే సమయం కేటాయిస్తారు. అయితే మహేష్ వారణాసి తర్వాత ఆయన చెయ్యబోయే నెక్స్ట్ మూవీ పై అందరిలో విపరీతమైన ఆసక్తి నడుస్తుంది.

అయితే వారణాసి చిత్రం కోసం లాంగ్ హెయిర్ ని గత రెండేళ్లుగా మైంటైన్ చేస్తున్న మహేష్ బాబు ఇప్పుడు వారణాసి లుక్ నుంచి కొత్త లుక్ లోకి మారిపోయారు. అది కూడా ఆయన తదుపరి మూవీ కోసమే అంటున్నారు. లాంగ్ హెయిర్ ని షార్ట్ చేసి క్యాప్ పెట్టుకుని మహేష్ కొత్తగా కనిపించారు.

ఇక మహేష్ తదుపరి మూవీ ఎప్పుడు మొదలు పెడతారు, ఎవరితో మొదలు పెడతారు అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు మాత్రం మహేష్ న్యూ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Superstar Mahesh Babu's brand-new look