BB10:ఈ వారం టాప్, డేంజర్ జోన్ ఎవరంటే..
Bigg Boss Telugu 10 Week 3 Voting result
బిగ్ బాస్ సీజన్ 10 మూడో వారం పూర్తి చేసుకోబోతుంది. ప్రస్తుతం టెంప్టేషన్ vs టెన్షన్ అంటూ కెప్టెన్సీ కంటెండర్స్ గా మారేందుకు బజర్ టాస్క్ లతో బిగ్ బాస్.. హౌస్ మేట్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే ముఖేష్ గౌడ్, సృష్టి, అమన్ లు ఈ టాస్క్ ల్లో గెలిచి కంటెండర్స్ గా మారారు.
ఇక ఈ వారం హౌస్ లో ఎలిమినేషన్ హీట్ కనిపిస్తుంది. మొదటి వారం చైత్ర రాయ్ ఎలిమినేట్ అవ్వగా రెండో వారం కృష్ణుడు బయటికెళ్లిపోయాడు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న త్రిగుణ్, సుధీర్, వర్షిణి, అమన్, చరణ్, వంశి, షాలిని, ఝాన్సీ లు నామినేషన్స్ లోకి వచ్చారు. మరి వీరిలో ఎవరు ఆడియన్స్ వోటింగ్ లో టాప్ లో ఉన్నారు, ఎవరు డేంజర్ లో ఉన్నారు అంటే...
ఈ వారం ఓటింగ్ లో త్రిగుణ్ నెంబర్ 1 ప్లేస్ లో అందరికన్నా ఎక్కువ ఓట్లు కొల్లగొడుతుంటే.. సెకండ్ పొజిషన్ లో సింపతీ ఓట్లతో సుధీర్ ఉన్నాడు. గత రెండు వారాలుగా డల్ మోడ్ లో ఉన్న సుధీర్ పైకి సృష్టి వెళ్లడం, నామినేషన్స్ లో సుధీర్ పై సృష్టి చెత్త పోసిన విధానంతో సుధీర్ కి ఆడియన్స్ లో సింపతీ క్రియేట్ అయ్యింది.
ఇక లాస్ట్ స్థానంలో ఉంటూ వస్తున్న వర్షిణి అనూహ్యంగా మూడ్ ప్లేస్ కి చేరుకుంది. ఆతర్వాత స్వల్ప తేడా తో చరణ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఐదో సస్థానంలో అమన్, ఆతర్వాత షాలిని ఉండగా.. చివరిగా డేంజర్ జోన్ లో ఝాన్సీ కనిపిస్తుంది. ఆమె రైతు బిడ్డ సింపతీ కార్డ్ ఆడియన్స్ కి చిరాకు తెప్పిస్తుంది.
మరి నాలుగో స్తానం నుంచి ఉన్న కంటెస్టెంట్స్ చాలా తక్కువ మార్జిన్ తో కనిపిస్తున్నారు. అంటే వారిలో ఎవ్వరు ఎలిమినేట్ అయినా ఈ వారం ఆశ్చర్యపోవక్కర్లేదు.
















































