ఓపెనింగ్స్ తో దుమ్మురేపిన నేచురల్ స్టార్
Huge Opening Day For The Paradise
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన ది ప్యారడైజ్ చిత్రం భారీ అంచనాలతో నిన్న పాన్ ఇండియాలోని పలు భాషల్లో ఆడియన్స్ ముందుకు వచ్చింది.1980ల నేపథ్యంలో ది ప్యారడైజ్ తెరకెక్కింది. అణగారిన ఓ వర్గం గుర్తింపు కోసం నాని చేసే పోరాటం, అణచివేత ప్రధానాంశాలుగా సినిమా తెరకెక్కింది.
ఈ నెల 23 నైట్ నుంచే ప్రీమియర్స్ తో ది ప్యారడైజ్ హవా థియేటర్స్ లో కనిపించింది. సినిమా విడుదలకు ముందు నుంచే సినిమాపై విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యింది. ప్యారడైజ్ ట్రైలర్ వదలకపోయినా ప్రేక్షకులు పట్టించుకోకుండా థియేటర్స్ కి పరుగులు పెట్టారు. దానితో ఈ యాక్షన్ డ్రామా నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది.
మొదటి రోజు ది ప్యారడైజ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.88 కోట్ల గ్రాస్ తెచ్చినట్లుగా నిర్మాతలు అధికారికంగా పోస్టర్ తో ప్రకటించారు. సినిమాకి ఎలాంటి టాక్ స్ప్రెడ్ అయినా నాని కెరీర్ లోనే ప్యారడైజ్ తో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ కొల్లగొట్టాడు. ప్రివ్యూ షోల ఆదాయంతో కలిపి మొదటి రోజు ప్యారడైజ్ బిగ్ నెంబర్లు నమోదు చేసింది.
















































