ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ రిలీజులు
This Week Theatre and OTT Releases
గత వారం విడుదలైన చిన్న చిత్రాల జాతర ముగిసింది. ఇక ఈవారం అందులోను లాంగ్ వీకెండ్, వినాయక చవితి పండుగ సెలవని క్యాష్ చేసుకునేందుకు పొలోమంటూ పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అందులో కొన్ని సెప్టెంబర్ 10 న విడుదలకు రెడీ అవుతున్నాయి. కార్తీ సర్దార్ 2, మారెమ్మ, సుహాస్ మందాడి డబ్బింగ్ సినిమా లు సెప్టెంబర్ 10 న విడుదలవుతుంటే.. ఆనంద్ దేవరకొండ ఎపిక్, అక్కినేని సుమంత్ మహేంద్రగిరి వారాహి చిత్రాలు సెప్టెంబర్ 11 న థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి.
ఈ వారం ఓటీటీల్లో క్రేజీ అండ్ ఇంట్రెస్టింగ్ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
అమెజాన్ ప్రైమ్
పళ్లబురుసు (తెలుగు విలేజ్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 2
ది రన్నర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 2
జగమే సంగీతం (తెలుగు క్లాసికల్ మ్యూజికల్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
నెట్‌ఫ్లిక్స్
గాంధారి (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- సెప్టెంబర్ 3
జీడీ నాయుడు (తెలుగు తమిళ బయోగ్రాఫికల్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 4
కొరియన్ కనకరాజు (తెలుగు ఇండో కొరియన్ కామెడీ హారర్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 4
హాట్‌స్టార్
ది కోర్ట్ (తెలుగు డబ్బింగ్ తమిళ కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
సోనీ లివ్
ఉన్మాదం (తెలుగు డబ్బింగ్ మలయాళ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ ప్రొసీజరల్ సినిమా)
సన్ నెక్ట్స్
డీసీ (తెలుగు డబ్బింగ్ తమిళ రివేంజ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ)
ఆహా
ది ఎల్లో ఎలిఫెంట్ (తెలుగు డబ్బింగ్ తమిళ సర్వైవల్ డాక్యుమెంటరీ సినిమా)
ఈటీవీ విన్
జ్ఞాపకాలు (తెలుగు ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా చిత్రం)







































