పారడైజ్ కి ప్రమోషన్స్ అక్కర్లేదు

The Paradise updateThe Paradise update


హీరో నాని లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. ఈ సినిమా పోస్ట్ పోన్ ఊహాగానాలకు మేకర్స్ తెరదించారు. ప్యారడైజ్ షూటింగ్ పూర్తి కాలేదు, అందుకే వాయిదా పడొచ్చంటూ రెండు రోజులు సోషల్ మీడియాలో ప్రచార జరగడం, వాటిని పోస్టర్స్ తో మేకర్స్ ఖండించడం చూసాం. అయితే ప్యారడైజ్ కి సంబంధించి కేవలం ఓ సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సో ఇకపై ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఫాస్ట్ గా పూర్తి చేస్తుందట టీం. అయితే పాన్ ఇండియా రిలీజ్ మూవీస్ కి ప్రమోషన్స్ ఎంతో కీలకం. కానీ ప్యారడైజ్ చిత్రం పై ఉన్న అంచనాలు, క్రేజు చూసాక ప్రమోషన్స్ లేకపోయినా ఓపెనింగ్స్ లో నాని ప్యారడైజ్ రికార్డ్ క్రియేట్ చెయ్యడం ఖాయం అంటున్నారు.

ప్యారడైజ్ మొదటి టీజర్, అలాగే ఆయా షేర్, నిన్నగాక మొన్న అనిరుధ్ మ్యూజిక్ లో వచ్చిన ఏశ నాగుల కట్ట మీద సాంగ్ తో ప్రస్తుతం సినిమాపై విపరీతమైన అంచనాలు వచ్చేసాయి. ప్యాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడం ప్లస్ అయ్యింది. మరి ముంబై, చెన్నై, బెంగుళూరు ఇలా అక్కడో ప్రెస్ మీట్, ఇక్కడో ప్రెస్ మీట్ పెడితే చాలు, ప్రమోషన్స్ కోసం నాని పరుగులు పెట్టక్కర్లేదు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చూద్దాం పక్కా ప్లానింగ్ తో కనిపించే నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ ప్రమోషన్స్ కోసం ఎలాంటి స్టెప్ వేస్తారో అనేది. 

The Paradise