నందన వీసా చీటింగ్ కేసు

Nandana Visa cheating case updateNandana Visa cheating case update

 

సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుని, వీసాల ద్వారా కొంతమందిని మోసం చేసిన నందూస్ వరల్డ్ అలియాస్ రమా నందనను నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూకేలో ఉంటున్న మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ యూకే వీసా పొడిగింపు కోసం తమ దగ్గరనుంచి మధుకర్, మధుకర్ తండ్రి, మధుకర్ భార్య నందన లు లక్షల్లో డబ్బు వసూలు చేసి మోసం చేసినట్లుగా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో నందన భర్త మధుకర్‌ను A1గా, రమా నందనను A2గా, మధుకర్ తండ్రి మోహన్‌రావును A3గా చేర్చారు. యూకే వీసా పొడిగింపు, మరియు సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ఇప్పిస్తామని నమ్మించి, డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట విడతల వారీగా రూ. 15 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే నందన తమపై వస్తున్న ఆరోపణలను ఖండించింది. ఆ కన్సల్టెన్సీతో తమకు ఎలాంటి సంబంధం లేదని, వ్యక్తిగత కక్షలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె పలు వీడియోస్ చేసింది.

అయితే నందన, ఆమె భర్త మధుకర్ లు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారి చేసారు. అయితే ఈ కేసులో నందన 15 రోజుల క్రితమే విచారణకు సహకరిస్తాననని విజయవాడ పోలీస్ కమిషనర్, డీసీపీ లకు మెయిల్ చెయ్యడమే కాకుండా.. ఇండియా వచ్చి విచారణకు సహకరిస్తానని, తమపై పెట్టిన లుక్ అవుట్ నోటీసు తీసేయాలని పోలీసులను ఆమె మెయిల్ లో కోరినట్లుగా తెలుస్తుంది.  

అయితే ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసు తీసేయటం కుదరదని విచారణకు రావాలని చెప్పటంతో నందన నిన్న హైదరాబాద్ కు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నందన విచారణ పూర్తయ్యాక ఆమె భర్త యుకె నుంచి ఇండియాకు వచ్చి విచారణకు హాజరు అవుతారని పోలీసులకు రమా నందన చెప్పినట్టు సమాచారం.

Rama Nandana Visa cheating case update