మోక్షజ్ఞ డెబ్యూ పై మరో వార్త

Mythri to Introduce MokshagnyaMythri to Introduce Mokshagnya


నందమూరి మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యే విషయంలో నెలకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మొదలు కావాల్సి ఉంది. అది అనౌన్సమెంట్ వచ్చాక ఆగింది. ఆ ప్రాజెక్ట్ ఆగి రెండేళ్ళు అవుతుంది. మరో దర్శకుడు మోక్షజ్ఞ ను ఒప్పించలేకపోతున్నారో, లేదంటే కథ విషయంలో మోక్షు కాంప్రమైజ్ అవ్వడం లేదో..

ఇప్పటివరకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ మాత్రం స్టార్ట్ ఇవ్వలేదు. ఈ మధ్యన దర్శకుడు వశిష్ట మోక్షజ్ఞ ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నారనే వార్త వైరల్ అయ్యింది. ఆ మూవీ దసరా కు పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతుంది అని కూడా ప్రచారం జరిగింది.

ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ నందమూరి వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు అంటున్నారు. మరి రోజుకో వార్త మోక్షజ్ఞ డెబ్యూ పై రావడం, చివరికి అది గాల్లో కలిసిపోవడం రొటీన్ గా మారిపోయింది.

ఏది ఏమైనా బాలయ్య మీడియా ముందుకు వచ్చి తన వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ప్రకటించేవరకు ఏది నమ్మే పరిస్థితి అయితే లేదు. 

Nandamuri Mokshagna