ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sandeep Vanga Says Varanasi Is Bigger Than Spirit

స్పిరిట్ vs వారణాసి-సందీప్ రెడ్డి క్రేజీ కామెంట్స్

Sandeep Vanga Says Varanasi Is Bigger Than SpiritSandeep Vanga Says Varanasi Is Bigger Than Spirit


కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ పై భారీ అంచనాలున్నాయి. ప్రభాస్ ఎలాంటి డూప్ లేకుండా స్పిరిట్ షూటింగ్ లో పాల్గొంటున్నారని నిర్మాత ప్రణయ్ రెడ్డి ఈ మధ్యనే రివీల్ చేశారు. మరోపక్క దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో గ్లోబల్ వైడ్ వారణాసి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

అయితే ఈ రెండు చిత్రాలు వచ్చే ఏడాది కేవలం ఒక్క నెల గ్యాప్ లో పోటీపడబోతున్నాయి. ఆ విషయంలో చాలా చర్చ నడుస్తుంది. రెండు పాన్ ఇండియా మూవీస్ నెల గ్యాప్ లో రావడంపై రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాజాగా సందీప్ రెడ్డి నిర్మించిన రోమాంచకం చిత్ర ఈవెంట్ లో సందీప్ రెడ్డికి మీడియా నుంచి వారణాసి, స్పిరిట్ విడుదలపై అదే ప్రశ్న ఎదురైంది.

దానిపై సందీప్ రెడ్డి వంగ క్రేజీ కామెంట్స్ చేసారు. స్పిరిట్, వారణాసి ఆ రెండు సినిమాల మధ్య రిలీజ్ డేట్స్ కి దాదాపు 37 రోజుల గ్యాప్ ఉంది, అది సరిపోతుంది. పైగా స్పిరిట్ కంటే వారణాసి చాలా పెద్ద సినిమా అన్న సందీప్ రెడ్డి వంగ.. వారణాసి కి దారిచ్చి స్పిరిట్ ని పోస్ట్ పోన్ చెయ్యాలని అనుకుంటున్నారా ఏమిటి అంటూ సరదాగా మాట్లాడారు.

Sandeep Vanga Calls Varanasi Much Bigger Than Spirit