ఇరుముడి కి ఎదురు లేదు
Ravi Teja Irumudi
నిన్నటివరకు రవితేజ ఇరుముడి కి ఈ రోజు నుంచి డౌన్ ఫాల్ మొదలవుతుంది.. సోమవారం టెస్ట్ పాస్ అయిన ఇరుముడికి బుధవారం నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురుకాబోతుంది, రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన ఇరుముడి కి ఆగష్టు 26 నుంచి కలెక్షన్స్ డ్రాప్ అవుతాయని ట్రేడ్ అలాగే ఆడియన్స్ ఇద్దరూ భావించారు. కారణం కన్నడ పాన్ ఇండియా మూవీ టాక్సిక్.
ఈరోజు ఆగష్టు 26 న విడుదలైన టాక్సిక్ చిత్రం వలన ఇరుముడి కి భారీ లాస్, హిట్ చిత్రం కూడా టాక్సిక్ సునామి లో కొట్టుకుపోవాల్సిందే అనుకున్నారు. కానీ ఇరుముడికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇరుముడి కి వచ్చిన సమస్య లేదు.. అసలు రవితేజ ఇరుముడి కి ఎదురు లేదు. ఎందుకంటే టాక్సిక్ చిత్రానికి తెలుగులోనే కాదు పాన్ ఇండియా మార్కెట్ నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వస్తుంది.
యశ్ పెరఫార్మెన్స్ తప్ప టాక్సిక్ లో చెప్పుకోవడానికి ఏమి లేదు, టాక్సిక్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చెత్తగా ఉంది, గందరగోళంగా ఉంది అంటూ సోషల్ మీడియాలో వేస్తోన్న ట్వీట్లు చూస్తే టాక్సిక్ ఫస్ట్ డే కి పడుకోవాల్సిందేఅనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాక్సిక్ టాక్ చూసాక రవితేజ ఇరుముడి మళ్లీ పుంజుకోవడం ఖాయం.







































