ఇరుముడి ఊపు మరో రెండు రోజులేనా
Irumudi vs Toxicరవితేజ లేటెస్ట్ చిత్రం ఇరుముడి విడుదలైన రెండు ఓజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి అందరికి షాకిచ్చింది. రవితేజ కెరీర్ లోనే ఇరుముడి బెస్ట్ ఓపెనింగ్స్ రావడమే కాదు, కేవలం రెండే రోజుల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైన ప్రతి ఏరియా లో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతలకు లాభాలు తీసుకొస్తుంది. ఇరుముడి ఫస్ట్ వీకెండ్ లోనే రూ.100 కోట్ల క్లబ్బులో చేరేలా ఉంది.
అయితే ఇరుముడి ఊపు మరో రెండు రోజులేనా.. బుధవారంతో ఇరుముడి మూట ముల్లె సర్దుకోవాలా ఇదే ఇప్పుడు ట్రేడ్ లో నడుస్తున్న ముచ్చట. బుధవారం పాన్ ఇండియా ఫిలిం టాక్సిక్ విడుదల. యశ్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ పై అంచనాలు బావున్నాయి. అయితే టాక్సిక్ చిత్రం ఏ సర్టిఫికెట్ మూవీ.
ఒకవేళ టాక్సిక్ బావున్నా.. అది పెద్దలకే మాత్రమే కాబట్టి.. ఇరుముడి కి ప్రాబ్లెమ్ ఉండదు. కారణం ఇరుముడి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో కుటుంబ ప్రేక్షకులు టాక్సిక్ ఎలా ఉన్నా.. ఇరుముడి వైపే మొగ్గు చూపుతారు. ఒకవేళ టాక్సిక్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఇరుముడి చిత్రానికి ఎలాంటి నష్టం ఉండదు.
మరోపక్క ఇరుముడి పై వీకెండ్ లో ఉన్న ఊపు వీక్ డేస్ సోమవారం నుంచి ఉంటుందా, ఇరుముడి సోమవారం పెరఫామెన్స్ పై కూడా చాలామంది ఆసక్తి కనిపిస్తుంది.







































