మమిత బైజు పై స్టార్ హీరోల కన్ను పడేనా?

Actress Mamitha BaijuActress Mamitha Baiju


విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో విపరీతంగా పాపులర్ అయిన ప్రేమలు బ్యూటీ మమిత బైజు పై ఇప్పటికైనా స్టార్ హీరోల కన్నుపడుతుందా.. విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రంలో MBBS చదివే అమ్మాయిగా, చదువు కోసం సరోగసి మదర్ గా మారడమే కాదు, 40 ప్లస్ అబ్బాయి ప్రేమ కోసం పరితపించే అమ్మాయిగా, మదర్ గా మమిత బైజు నటనకు తెలుగు ఆడియన్స్ నుంచి క్లాప్స్ పడుతున్నాయి.

మమిత బైజు యాక్టీవ్ గా చేసిన అల్లరి, ఆమె పెరఫార్మెన్సు కి విజిల్స్ వేస్తున్నారు. సూర్య తో ఆమె సీన్స్, రాధికా కాంబో సీన్స్ లో మమిత బైజు నటన బావుంది అంటున్నారు. గ్లామర్ విషయంలో ఎలా ఉన్నా పెరఫార్మెన్స్ చూసి ఆమెకు ఛాన్స్ లు ఇవ్వాల్సిందే, మరి టాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ మమిత ను తమ సినిమాల్లో కన్సిడర్ చేస్తారేమో చూడాలి.

విశ్వనాథ్ అండ్ సన్స్ మాత్రం మమిత బైజు కెరీర్ కి బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది ఆమె బలంగా నమ్ముతుంది. చూద్దాం మమిత అదృష్టం ఎలా ఉందొ అనేది.

Mamitha Baiju