క్రిస్మస్ పై NBK111 కన్ను
NBK 111 eyeing for X Mas release
నందమూరి బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కలయికలో రెండో మూవీ గా తెరకెక్కుతున్న NBK 111 ప్రాజెక్ట్ షూట్ కి ప్రస్తుతం బ్రేకిచ్చారు. బాలయ్య సెట్ లో గాయపడి సర్జరీ చేయించుకోవడంతో మేకర్స్ షూటింగ్ ని నిలిపివేశారు. బాలయ్య త్వరగా కోలుకుని నిర్మాతలు ఇబ్బంది పడకుండా సెట్ లోకి వెళ్లేందుకు కూడా రెడీ అవుతున్నారనే టాక్ ఉంది.
అయితే బాలయ్య కు ప్రమాదం జరగముందు NBK 111 ప్రాజెక్ట్ డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ చేసుకున్నారు. రిలీజ్ డేట్ తో పాటుగా టైటిల్ గ్లింప్స్ కూడా వస్తాయనుకున్న సమయంలో బాలయ్య గాయపడ్డారు. దానితో అది ఆగిపోయింది. ఇక బాలయ్య గాయం పూర్తిగా నయం అవ్వాలి, షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. దానికి సమయం పడుతుంది.
అందుకే క్రిస్మస్ కి NBK 111 ప్రాజెక్ట్ వచ్చే అవకాశం లేదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ డిసెంబర్ లో క్రిస్మస్ కి NBK 111 ప్రాజెక్ట్ ని దించే ఆలోచనలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో మోత మోగిపోతుంది. NBK 111 కన్ను క్రిస్మస్ బాక్సాఫీసు బరిపై పడింది అంటున్నారు. మరి అదెలా సాధ్యమో చూడాలి.







































