VAS : రూ.200 నాటౌట్
Vishwanath and Sons enter 200 cr club
సూర్య బ్యాక్ టు బ్యాక్ రెండొందల క్లబ్బులోకి రెండుసార్లు అడుగుపెట్టారు. కరుప్పు తో రెండు వారాలకు రూ.200 కోట్ల క్లబ్బులోకి వెళ్లిన సూర్య మళ్లీ మూడు నెలల్లోనే విశ్వనాథ్ అండ్ సన్స్ తో పదిరోజుల్లో రూ.200 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టారు. సెకండ్ వీకెండ్ ముగియకముందే సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ రూ.200 కోట్లు కొల్లగొట్టినట్టుగా అధికారికంగా పోస్టర్ వేసి అనౌన్స్ చేసారు మేకర్స్.
పది రోజుల్లో సూర్య ఫ్యామిలీ ఎంటర్టైనర్ విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లు తీసుకొచ్చింది. తెలుగులో ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ విశ్వనాథ్ అండ్ సన్స్ కి తమిళనాట కనిపిస్తే ఇప్పటికే రూ.300 కోట్లు తీసుకొచ్చేది. కానీ తమిళ ఆడియన్స్ ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని పెద్దగా పట్టించుకోలేదు.
తెలుగులోనే ఈ చిత్రానికి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి . మరి పది రోజుల్లో విశ్వనాథ్ అండ్ సన్స్ రూ.200 కోట్లు తీసుకొచ్చి నాటౌట్ అంటుంది. అంటే లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో అనే ఆసక్తి మొదలైంది. అదే రవితేజ ఇరుముడి గనక అడ్డుపడకుండా ఉండి ఉంటే ఈ చిత్రం ఇంకా రికార్డ్ కలెక్షన్స్ కొల్లగొట్టేది. కానీ రవితేజ ఇరుముడి సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ఆశలపై నీళ్లు చల్లింది.







































