ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Waiting for Deepika Padukone's reaction

దీపికా రియాక్షన్ కోసం వెయిటింగ్

Waiting for Deepika Padukone's reactionWaiting for Deepika Padukone's reaction


కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. పని గంటల విషయంలో స్పిరిట్ సినిమా నుంచి ఆమె ను తప్పిచడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది. టాప్ హీరోయిన్ స్థానే అప్ కమింగ్ హీరోయిన్ త్రిప్తి డుమ్రి ని ఎంపిక చెయ్యడం సంచలననే అయ్యింది.

ఇప్పటికి ఆ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న సమయంలో మరోసారి సందీప్ రెడ్డి వంగ సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా ఓ ఇంటర్వ్యూలో దీపికా పదుకొనె పారితోషికంతో పాటుగా స్పిరిట్ లాభాల్లో పది శాతం వాటా అడిగింది, అంతేకాకుండా ఎనిమిది గంటల పని గంటల కండిషన్ పెట్టింది అంటూ క్లియర్ కట్ గా దీపికా ను ప్రణయ్ రెడ్డి వంగా టార్గెట్ చేశారు.

తాజాగా ప్రణయ్ రెడ్డి వంగా అలిగేషన్స్ పై దీపికా పదుకొనె ఎలా రియాక్ట్ అవ్వబోతుంది అనే విషయంలో అందరిలో ఆసక్తి కనిపిస్తుంది. సందీప్ కి, ప్రణయ్ రెడ్డి కి కలిపి దీపికా కౌంటర్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.