Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Archana Ravi is engaged to producer Shawn Antony

నిర్మాత‌తో న‌టి ల‌వ్.. ఎంగేజ్ మెంట్!

Archana Ravi is engaged to producer Shawn Antony

మలయాళ, తమిళ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి, మోడల్ అర్చన రవి  వ్యక్తిగత జీవితంలో కీలక అడుగు ముందుకు వేశారు. `అటూ` చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె బ్లాక్‌బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్ `మంజుమ్మ‌ల్ బాయ్స్`  చిత్ర నిర్మాత ఆంటోనీ షోన్  తో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా   అభిమానులతో పంచుకున్నారు.  ఇరు కుటుంబ సభ్యులు - అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక  నిరాడంబరంగా జరిగింది.

2023 నుండి ప్రేమలో ఉన్న  జంట తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన మధురమైన జ్ఞాపకాలను ఫోటోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. `మేము ఇద్దరం మా జీవితంలో అత్యుత్తమ దశలను.. అలాగే అత్యంత క్లిష్టమైన కష్టకాలాలను కూడా కలిసి చూశాం` అంటూ వారు రాసుకొచ్చిన భావోద్వేగ నోట్ నెట్టింట వైరల్ అవుతోంది.

మోడలింగ్ రంగం ద్వారా కెరీర్ ప్రారంభించిన అర్చన రవి మిస్ సౌత్ ఇండియా ఫస్ట్ రన్నరప్‌గా - ఫెమినా మిస్ ఇండియా కేరళ ఫైనలిస్ట్‌గా పలు సౌందర్య పోటీల్లో రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చారు. ప్రస్తుతం ఆమె మిస్ సౌత్ ఇండియా పేజెంట్ డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆంటోనీ షోన్  `మంజుమ్మ‌ల్ బాయ్స్`, `జాన్ ఇ మన్` వంటి విజయవంతమైన చిత్రాల ద్వారా టాలెంటెడ్ నిర్మాతగా మాలీవుడ్‌లో మంచి పేరు సంపా దించుకున్నారు.  
 

Archana Ravi Engaged To Manjummel Boys Producer Shawn Antony