భార్య-భర్తల మధ్యలోకి పూనమ్ పాండే!
Poonam Pandey Supports Govinda After Sunita Ahuja's Remarksబాలీవుడ్ సీనియర్ హీరో గోవింద్ - సతీమణి సునీతా అహుజా మధ్య వ్యక్తిగత విషయాలు, ఆరోపణలు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సునీత చేసిన కొన్ని వ్యాఖ్యలు - అఫైర్ ఆరోపణల నేపథ్యంలో గోవింద్‌కు మద్దతుగా బాలీవుడ్ నటి పూనమ్ పాండే నిలిచారు. గోవింద్ వ్యక్తిత్వం చాలా మంచిదని, ఆయనకు సంబంధించిన వివాదాలు సరికావంటూ అభిప్రాయపడింది.
గోవింద్‌పై వస్తోన్న ఆరోపణలను పూనమ్ పాండే నిర్మొహ మాటంగా ఖండించింది. ఆయనలాంటి మంచి భర్త దొరకడం చాలా అదృష్టమని కొనియాడారు. `ఇట్నే అచ్ఛే పతిదేవ్ మిలే హై` (అంత మంచి భర్త దొరికారు) అంటూ గోవింద్‌ను వెనకేసుకొచ్చారు. ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గోవింద్ వ్యక్తిగత జీవితంపై ఇలాంటి నిరాధార ఆరోపణలు రావడం బాధాకరమని.. ఆయన ఎప్పుడూ కుటుంబానికి, భార్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివాదంపై పలువురు సెలబ్రిటీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ పూనమ్ పాండే బహిరంగంగా గోవింద్‌కు మద్దతు తెలపడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉన్నట్లుండి పాండే బ్యూటీ మద్దతు తెలపడం వెనుక పబ్లిసిటీ స్టంట్ ఉందా? అన్న అనుమానాలు నెటి జన్లు వ్యక్తం చేస్తున్నారు.







































