ఫ్యామిలీ ఫోటో డంప్‌తో ట్రెండింగ్‌లో క్యూట్ మూమెంట్స్!

Janhvi Kapoor and Shikhar Pahariya

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ - ప్రియుడు శిఖర్ పహారియా నిత్యం ఏదో రూపంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తుంటారు. తాజాగా ఈ జోడీ ముంబైలో మరోసారి మీడియా కంటపడి సందడి చేసింది. బిజీ షెడ్యూల్స్ మధ్య లోనూ ఇద్దరూ కలిసి బయటకు వచ్చిన వీడియో  నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ జంట సింప్లిసిటీ .. స్టైలిష్ లుక్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

జాన్వీ కపూర్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిగత ఫోటో డంప్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఈ కలెక్షన్‌లో జాన్వీ సోదరి ఖుషి కపూర్ - తండ్రి బోనీ కపూర్ తో గడిపిన మధురమైన క్షణాలు, ఫ్యామిలీ వెకేషన్ పిక్స్ ఉన్నాయి. కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన ఆ జ్ఞాపకాలను  అభిమానులతో పంచుకోవడం విశేషం. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నాన‌? కుటుంబానికి జాన్వీ ఇచ్చే ప్రాధాన్యతకు ఈ పిక్సే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

సినిమాలతో పాటు వ్యక్తిగత జీవిత విశేషాలతోనూ జాన్వీ కపూర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. శిఖర్‌తో  రిలేషన్‌షిప్ బాండ్ మరింత బలపడుతుండటం, మరోవైపు ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్న క్షణాలు జాన్వీ అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తున్నాయి. ఈ క్యూట్ కపుల్ -ఫ్యామిలీ పిక్స్ ప్రస్తుతం బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
 

Janhvi Kapoor and Shikhar Pahariya step out together amid latest photo dump