నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అయ్యిందా?
Mokshagna is said to be teaming up with Vassishta for his debut film
గత రెండేళ్లుగా నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీపై నడుస్తున్న సస్పెన్స్ మాములుగా లేదు. మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే క్షణం కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తుంటే ఆ క్షణం వెనక్కి పోతుంది. రెండేళ్ల క్రితమే మోక్షజ్ఞ హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వాల్సి ఉండగా.. ఆ సినిమా ఆగిపోయింది.
ఫస్ట్ లుక్ తో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ఆగిపోయింది. తదుపరి ప్రాజెక్ట్ మోక్షజ్ఞ ఏ దర్శకుడితో చేస్తాడో అనే క్యూరియాసిటీ లో అభిమానుల్లో ఉన్నా అది నెరవేరేది ఎప్పుడో అనే అనమానంలోనూ ఉన్నారు. తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి దసరా ముహూర్తం అనే వార్త విపరీతంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అది కూడా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, ఈ మూవీ దసరా కు లాంఛనంగా ప్రారంభం కాబోతుంది అంటున్నారు. మరి ఇదే నిజమైతే అభిమానుల ఎదురు చూపులకు తెర పడినట్లే. చూద్దాం మోక్షు ఎంట్రీ ఈ ఏడాది ఉంటుందా, లేదా అనేది.







































