`రాకా` లో హాలీవుడ్ సెన్సేషన్!
Raaka: Hollywood Star to flex musclesఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `రాకా` గురించి ఓ సంచలన వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్‌లో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నటిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేయడంతో మేకర్స్ విల్ స్మిత్ ని రంగంలోకి దించుతున్నారా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.
చిత్రంలో విల్ స్మిత్ కీలకమైన ..పవర్‌ఫుల్ పాత్రకు ప్రయత్నిస్తున్నారుట. సినిమాలోని కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ఆయన విదేశాల్లో జరిగే షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ సినిమా స్థాయిని గ్లోబల్ మార్కెట్‌కు తీసుకువెళ్లేలా అట్లీ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ టెక్నీషియన్లతో కలిసి అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త నిజమైతే అల్లు అర్జున్ - విల్ స్మిత్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇండియన్ సినిమా చరిత్రలోనే అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుంది.
ఈ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ ట్రెండింగ్‌లో ఉంది. `పుష్ప 2` తో గ్లోబల్ వైడ్‌గా క్రెడిబిలిటీని పెంచుకున్న అల్లు అర్జున్ `రాకా` సినిమాతో హాలీవుడ్ రేంజ్‌కు వెళ్తుండటం అభిమానులకు జోష్ అందిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను యూనిట్ అధి కారికంగా వెల్లడించే అవకాశం ఉంది.







































