బఘీరా అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్
NTR Mourns Pet Dog Bagheera
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం భుజానికి సర్జరీ చేయించుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్టీఆర్ భుజానికి జరిగిన సర్జరీ తో ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం డ్రాగన్ షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ సోషల్ ఇండియా వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఎన్టీఆర్ ప్రేమగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క బఘీర తనని వీడి వెళ్లిపోవడంతో ఎంతో ఎమోషనల్ అవుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. బఘీరా, నువ్వు నా వరల్డ్ లోకి ఒక తోడుగా వచ్చి, నిశ్శబ్దంగా మా ఫ్యామిలీ లో ఓ పార్ట్ అయ్యావు. సరదాగా, ప్రేమగా, ఎంతో విశ్వాసంతో అల్ల్లరి చేస్తూ ఓదార్పు ఇస్తూ నా ఇన్ని రోజులను నింపేశావు.
నువ్వు లేని లోటు నాకు పూడ్చలేని నిశ్శబ్దాన్ని మిగిల్చింది, కానీ మా కోసం నువ్వు వదిలి వెళ్ళిన ప్రేమ కూడా అంతే పెద్దది. ననాతొ ఉన్న ఈ నాలుగేళ్ళను అందంగా మార్చినందుకు నీకు ధన్యవాదాలు. స్వేచ్ఛగా పరుగెత్తు, నా చిన్నారి. నిన్ను ఎంతో ప్రేమించాము, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాము బఘీరా అంటూ ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అవుతూ తన పెంపుడు కుక్కపై ప్రేమను కురిపించారు.







































