`స్పిరిట్` పోస్ట్‌పోన్ నిజ‌మా?

Prabhas Spirit not postponed

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్- సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ `స్పిరిట్` విడుదల తేదీపై వస్తున్న వాయిదా రూమర్లకు నిర్మాణ సంస్థ టీసిరీస్ గట్టిగా చెక్ పెట్టింది. ఈ సినిమా విడుదల వాయిదా పడుతోందంటూ ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా విడుదల చేసేందుకు శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నామని ప్ర‌తినిధులు అధికారికంగా వెల్లడించి.. ప్రభాస్ అభిమానులకు ఊరటనిచ్చారు.

మరోవైపు బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ - దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం కూడా అనుకున్న సమయానికే ప్రేక్షకు ముందుకు రానుంది. ఈ సినిమాను యథాతథంగా ఈద్ కానుకగా 2027 మార్చిలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో 2027 మార్చి నెలలో బాక్సాఫీస్ వద్ద రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలు తలపడనున్నాయనే చర్చ ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Spirit Is Not Getting Delayed