ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anirudh-Kavya Maran wedding date goes viral

అనిరుధ్ - కావ్య మారన్ వెడ్డింగ్ డేట్ వైరల్

Anirudh-Kavya Maran wedding date goes viral


టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ - సన్ రైజర్స్ అధినేత కావ్య మారన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు, వారిద్దరూ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నారనే వార్త ఎంతగా వైరల్ అవుతుందో అందరికి తెలిసిన విషయమే. ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కి వివాహం కూడా జరగబోతుంది అనే టాక్ ఉంది.

కొద్దినెలల క్రితం అనిరుధ్ రిలేటివ్, నటుడు మహేంద్ర.. అనిరుధ్ - కావ్య ల వివాహం పై చేసిన కామెంట్స్ వీరి ప్రేమ బంధాన్ని మరింతగా వైరల్ చేసాయి. తాజాగా అనిరుధ్ రవిచంద్రన్ - కావ్య మారన్ ల వెడ్డింగ్ డేట్ ఇపుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నవంబర్ 10 న అనిరుధ్ రవిచంద్ర-కావ్య మారన్ లు గ్రీస్ లో వివాహం చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది.

పెళ్లి తేదీ, గ్రీస్ అంటూ వెన్యూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. గ్రీస్ లో రెండు కుటుంబాల వారు ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే ఈ పెళ్లి వార్తలపై అటు అనిరుధ్ కానీ ఇటు కావ్య ఫ్యామిలీ కానీ అధికారికంగా స్పందించలేదు.

Anirudh Ravichander and Kavya Maran wedding date locked?