బ్రేకప్ పై ఇండైరెక్ట్ గా స్పందించిన ధృవ్
Dhruv Vikram responds to scrutiny on personal life
ఈమధ్యన నటి అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ వార్తలపై స్పందించారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో ప్రేమ మొదట్లో బాగానే ఉంటుంది. కానీ తర్వాత తర్వాత వారిలో అపరిచితుడు బయటికి వస్తాడు. నేను ప్రేమలో ఎన్నో భరించాను, నరకం అనుభవించాను అంటూ చేసిన కామెంట్స్ ధృవ్ విక్రమ్ గురించే అంటూ సోషల్ మీడియాలో ధృవ్ విక్రమ్ పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసేలా చేసాయి.
కారణం అనుపమ పరమేశ్వరన్ - ధృవ్ విక్రమ్ ప్రేమలో ఉన్నారు, వారి మద్యన బ్రేకప్ కూడా జరిగిపోయింది అనే ప్రచారం మాములుగా జరగలేదు. ఆతర్వాత అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు ధృవ్ ని ఉద్దేసించినవే, ధృవ్ అనుపమను అంతగా ఇబ్బంది పెట్టారా అంటూ మట్లాడుకున్నారు.
తాజాగా ధృవ్ విక్రమ్ ఓ ఇంటర్వ్యూలో బ్రేకప్ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసారు. నా బ్రేకప్ తర్వాత ఎదురైన కష్టకాలం నన్ను వ్యక్తిగతంగా ఎంతో ప్రభావితం చేసింది. అందులో నుంచి బయటపడడానికి నా ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందించిన సపోర్ట్ కారణం. సినిమా ఇండస్ట్రీలో ఉంటె పర్సనల్ లైఫ్ పై చాలామంది దృష్టి పెడతారని తెలుసు.
బ్రేకప్ సమయంలో మా అమ్మ నాకు ధైర్యాన్నిచ్చింది. నిజం చెప్పాలి అంటే ఆ ప్రచారం నన్ను నా జీవితాన్ని ఎలాంటి ప్రభావితం చెయ్యలేదు. మన గురించి మనం తెలుసుకోవాలి, ధైర్యంగా నిలబడాలి, మనం నిజాయితీగా ఉంటె ఏ ప్రచారము, ఏ విమర్శలు మనల్ని ఏమి చెయ్యలేవు అంటూ ధృవ్ తన బ్రేకప్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.







































