వారణాసి - హడావిడి లేదే
Varanasi movie update
సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కి మరొక్క రోజే సమయముంది. ఆగస్టు 9 సూపర్ స్టార్ బర్త్ డే. మరి ఆయన నటించే పాన్ ఇండియా ఫిలిం వారణాసి నుంచి ఎలాంటి ట్రీట్ రాబోతుంది అనే విషయంలో అభిమానులు ఎంతో ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే కి సమయం దగ్గర పడినా వారణాసి హడావుడి కనిపించడం లేదు.
రేపు రాబోయే ట్రీట్ పై రాజమౌళి ఏదో ఒక అప్ డేట్ ఇవ్వొచ్చుగా. కానీ ఎస్ ఎస్ రాజమౌళి వారణాసి సర్ ప్రైజ్ ని వదిలేవరకు తెలియకుండా సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నారా, అసలు ఏ టైం కి సూపర్ స్టార్ బర్త్ డే వారణాసి ట్రీట్ ఇవ్వబోతున్నారనే విషయంలో అభిమానులు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు.
వారణాసి నుంచి మహేష్ ఫోటో క్లిప్స్ వస్తాయి, కాదు మహేష్ పాత్రకు సంబందించిన వీడియో క్లిప్ అంటూ పలు రకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. మరి రేపు ఆగష్టు 9 న మహేష్ బర్త్ డే కి రాబోయే ఆ ట్రీట్ ఏమిటో వారణాసి నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ వస్తుందో అనే విషయంలో మహేష్ ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరపడే సమయమెపుడో చూద్దాం.







































