లాంగ్ వీకెండ్ జోష్ లో కనకరాజు లు

Korean Kanakaraju vs DC


ఆగష్టు ఫస్ట్ వీక్ తెలంగాణాలో మూడు రోజులు స్కూల్స్ కి సెలవలు. లాంగ్ వీకెండ్. మరి ఈ వీకెండ్ ని క్యాష్ చేసుకునేందుకు బాక్సాఫీసు దగ్గర హీరోలు పోటీపడ్డారు. అందులో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు ఒకటి. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ తో విడుదలైంది. వరుణ్ తేజ కొరియన్ కనకరాజు కి థియేటర్స్ లో ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ మొదలైంది.

సోషల్ మీడియాలో మౌత్ టాక్, క్రిటిక్స్ రివ్యూస్, పబ్లిక్ టాక్ అన్ని కొరియన్ కనకరాజు కి అనుకూలంగా ఉన్నాయి. కొరియన్ కనకరాజు కోసం థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. తెలంగాణాలో సోమవారం బోనాల జాతర సెలవు కనకరాజుకి ప్లస్ అవ్వబోతుంది. ఇక ఈ వారమే విడుదలైన మరో డబ్బింగ్ మూవీ డీసీ.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా ఇంట్రడ్యూస్ అయిన డీసీ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. తమిళ్ లోనే కాదు, తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. మరి ఈ లాంగ్ వీకెండ్ జోష్ లో వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.

ప్రేక్షకులు బోనాల జాతరలో పాటుగా ఈ కనకరాజులపై కూడా ఓ కనెయ్యండి.. మీకు మంచి అనుభూతి మిగులుతుంది.

Varun Tej-Lokesh Kanagaraj