హీరో మోహన్‌లాల్‌ కు బిగ్ షాక్

Mohanlal Denied Australia Visa

 

మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ కు బిగ్ షాక్ తగిలింది. మోహన్‌లాల్‌ కి ఆస్ట్రేలియా వీసా అనుమతి లభించలేదు. దానితో అక్కడ సిడ్నీ లో చెయ్యాల్సిన షో క్యాన్సిల్ అయ్యింది. ఈ వీసా ప్రాబ్లెమ్ తో సిడ్నీలో ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన లైవ్ షో అర్థాంతరంగా వాయిదా పడింది.

ఈరోజు అంటే ఆగస్టు 8 శనివారం సిడ్నీలోని నార్త్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సిన మిగతా వాళ్ళు ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారు. కానీ మోహన్ లాల్ కు మాత్రం వీసా లో జాప్యం జరగడంతో ఆయన సింగపూర్ లోనే ఉండిపోయారు.

దానితో ఆయన ఓ వీడియో విడుదల చేస్తూ అసలు ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కావడం లేదు. బహుశా ఏదైనా క్లైరికల్ పొరపాటు జరిగి ఉండొచ్చు. ఏదేమైనా దీనికి నేనే బాధ్యత వహిస్తున్నాను.. అంటూ మోహన్ లాల్ ఆస్ట్రేలియా అభిమానులకు సారీ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. 

Mohanlal apologises after visa issue forces cancellation of stage show