ఆసుపత్రిలో అవికా గోర్
Avika Gor hospitalised after dengue diagnosis
బాలికవదు సీరియల్ తో బుల్లితెరకు పరిచయమై.. ఆతర్వాత హీరోయిన్ గా వెండితెరకు ఇంట్రడ్యూస్ అయిన బాలీవుడ్ అమ్మాయి అవికా గోర్ పెళ్లి తర్వాత కూడా నటి గా కొనసాగుతుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో మళ్లీ హిందీకే వెళ్ళిపోయిన అవికా గోర్.. తాజాగా ఆసుపత్రి పాలైంది.
గత కొన్నిరోజులుగా అవికా గోర్ 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతుంది. దానితో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ టెస్ట్ ల్లో ఆమెకు డెంగ్యూ ఫీవర్ గా తేలింది. దానితో ఆమె ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆ విషయాన్నే అవికా గోర్ భర్త సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
ఐదు రోజులుగా అవికా ఏకంగా 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, షూటింగ్‌కు అంతరాయం కలిగితే నిర్మాతలు నష్ట పోతారనే ఆలోచనతో, తన వృత్తి పై ఉన్న డెడికేషన్ తో ఆమె తీవ్ర అనారోగ్యంలోనూ షూటింగ్‌లలో పాల్గొనడమే కాకుండా, ఒక యాడ్ షూట్ కోసం ఢిల్లీకి కూడా వెళ్లాల్సి వచ్చింది. దానితో ఆమెకు నీరసం మరియు జ్వరం మరింత పెరగడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.. అంటూ అవికా హెల్త్ అప్ డేట్ తెలియజేసారు.







































