ఆయా షేర్ కూడా అడుగున పడిపోతుంది
Nani The Paradise
నాని ప్యారడైజ్ రిలీజ్ డేట్ గనక లాక్ చెయ్యకపోతే ప్యారడైజ్ పై క్రేజ్ తగ్గిపోయేలా ఉంది. అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ ఆల్బమ్ నుంచి వచ్చిన ఆయా షేర్ మ్యూజిక్ లవర్స్ ని ఓ ఊపు ఊపేసింది. ఎక్కడ చూసినా ఆ సాంగ్ వినిపించింది. కానీ ఇప్పుడు ప్యారడైజ్ నుంచి విడుదల తేదీ ఆలస్యమయ్యేలా ఉంది.
ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ కూడా వినిపించడం లేదు. మేకర్స్ 200 మిలియన్ వ్యూస్ అంటూ పోస్టర్ వేశారు. అంతకుమించి ప్యారడైజ్ నుంచి అప్ డేట్స్ లేవు. నాని పాన్ ఇండియా మోజులో పడి క్రేజ్ తగ్గించుకుంటున్నారా అనే అనుమానం నాని అభిమానుల్లోనే మొదలైంది. నాని లుక్స్, మోహన్ బాబు విలన్ కేరెక్టర్ చెయ్యడం, ఫ్యాన్ ఇండియా స్టయిల్లో మూవీ కనిపించడంతో ప్యారడైజ్ పై అందరిలో ఆసక్తి, అంచనాలు మొదలయ్యాయి.
ఆగస్టు రిలీజ్ అన్న ప్యారడైజ్ మేకర్స్ ఆగష్టు వచ్చేస్తున్నా సినిమా ప్రమోషన్స్ కానీ, లేదంటే విడుదల తేదీ మారుతుంది అని కానీ అప్ డేట్ ఇవ్వకుండా కామ్ గా ఉంటున్నారు. పదే పదే రిలీజ్ డేట్ మార్చినా సినిమాపై ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మరి నాని ఆ వే లో ఆలోచిస్తే బెటర్ ఏమో చూడాలి.








































