డివైడ్ టాక్ తో జన నాయగన్ కు షాకింగ్ కలెక్షన్స్

Jana Nayagan 4 days collectionsJana Nayagan 4 days collections


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ కు తమిళనాట తప్ప మిగతా పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో డివైడ్ టాక్ వచ్చింది. తెలుగులో మరీ నెగటివ్ టాక్ రాగా.. హిందీలో పర్వాలేదనిపించిన జన నాయగన్ చిత్రానికి నాలుగు రోజుల్లో షాకింగ్ కలెక్షన్స్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

విజయ్ లాస్ట్ చిత్రానికి డివైడ్ టాక్ రావడం అభిమానులను డిజప్పాయింట్ చేసింది. తమిళనాట ఈ వీకెండ్ టికెట్ బుకింగ్స్ బావున్నా జన నాయగన్ కి సంబందించిన కలెక్షన్ పోస్టర్ రాకపోయేసరికి అభిమానుల్లోనూ అనుమానాలు కనిపించాయి. కానీ నాలుగు రోజుల్లో జన నాయగన్ ఏకంగా రూ.200 కోట్ల గ్రాస్ కి దగ్గరైంది.

అదే అందరికి షాకిచ్చింది. ఈ డివైడ్ టాక్ తో 4 రోజుల రన్ లో రూ.200 కోట్ల గ్రాస్ ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్టుగా తెలుస్తుంది. తమిళనాట జన నాయగన్ స్ట్రాంగ్ గా నిలిచి బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది.

Jana Nayagan collections