Advertisement

బాలయ్య పరామర్శ కోసం AIG కి బాబు

Chandrababu Naidu met Balakrishna


నందమూరి బాలకృష్ణ NBK111 సెట్ లో కాలు జారి పడిపోవడంతో ఆయన మోకాలికి గాయమైంది. దానికి ఓ సర్జరీ అవసరమని హైదరాబాద్ లోని AIG వైద్యులు సూచించడమే కాదు.. బాలయ్యకు మోకాలి కి విజయవంతంగా ఆపరేషన్ చేసారు. ప్రస్తుతం బాలయ్య AIG ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

AIG ఆసుపత్రి లో మోకాలి సర్జరీ చేయించుకున్న బాలయ్య ను పరామర్శించేందుకు ఏపీ ముఖ్యమంత్రి, బాలయ్య బావగారు చంద్రబాబాబు నాయుడు AIG ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాలయ్య యోగక్షేమాలు తెలుసుకున్నారు. బాలయ్య ఈరోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని అన్నా అది జరగలేదు.

బాలయ్య కు మోకాలి సర్జరీ జరగడం వలన ఆయన నటిస్తున్న NBK 111 షూటింగ్ వాయిదాపడింది. మరో నాలుగు వారాల పాటు బాలయ్య విశ్రాంతి తీసుకోవాలని వైదులు సూచించినట్లుగా తెలుస్తుంది.

CM Chandrababu meets Balakrishna in AIG hospital