Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Megastar supports actor Ramesh's family

నటుడు రమేష్ కుటుంబానికి మెగాస్టార్ అండ

Megastar supports actor Ramesh's family

 

తోటి కళాకారుల కష్టసుఖాల్లో ఎప్పుడూ ముందుండే మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

‘గబ్బర్ సింగ్’ చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రమేష్ గారు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న చిరంజీవి గారు వెంటనే స్పందించారు.

అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుబ్బారెడ్డి గారితో తరచుగా మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న చిరంజీవి గారు, చికిత్సకు అవసరమైన అన్ని విధాల సహాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన, చికిత్స ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో ఆయన సతీమణి గారుకి తన తరఫున ₹3 లక్షల చెక్కును అందజేశారు.

అంతేకాకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం అందేలా సిఫార్సు చేస్తామని చిరంజీవి గారు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

అలాగే నిన్న శ్రీ నాగబాబు గారు మరో ₹2 లక్షల చెక్కును అందించి ఆర్థిక సహాయాన్ని అందించారు.

తోటి కళాకారుల పట్ల చిరంజీవి గారు ఎప్పటినుంచో చూపిస్తున్న ఆప్యాయత, ఆత్మీయత, బాధ్యతాభావానికి ఇది మరో నిదర్శనంగా నిలిచింది. ఎన్నో సందర్భాల్లో అవసరంలో ఉన్న సినీ కార్మికులు, నటీనటులకు ఆయన అందించిన సహాయం పరిశ్రమలో అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

నటుడు రమేష్  త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలని చిరంజీవి గారు ఆకాంక్షించారు.

Mega Brothers make a big donation to Gabbar Singh Ramesh