ఆస్ట్రియా వెకేషన్ లో ఐకాన్ స్టార్ ఫ్యామిలీ!
Allu Arjun is currently enjoying a family vacation in Austriaఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా? కుటుంబానికి తగినంత సమయం కేటాయిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ `రాకా` సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయినా బన్నీకి విరామం దొరకడంతో భార్య స్నేహా రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి ఆస్ట్రియాలో ఫ్యామిలీ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. ఐరోపాలోని సుందరమైన ప్రకృతి అందాల మధ్య అల్లు అర్జున్ కుటుంబం ఆస్వాదిస్తున్న ట్రిప్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆస్ట్రియాలోని మంచుకొండలు, అందమైన ప్రదేశాల్లో పిల్లలతో కలిసి బన్నీ సరదాగా గడుపుతున్న క్షణాలు అభిమానుల్ని అలరిస్తున్నాయి.
షూటింగ్ ఒత్తిళ్ల నుంచి బన్నీ పూర్తిగా బయటకొచ్చి ఫ్యామిలీ తో రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఇలా బన్నీ ప్రొఫెషనల్ లైఫ్‌ను, పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. బన్నీ బ్యాచిలర్ గా ఉన్న సమయంలో వెకేషన్లకు చాలా తక్కువగానే వెళ్లేవారు. స్నేహారెడ్డితో లవ్ లో ఉన్న సమయంలో? ఆ ప్రయాణమంతా హైదరాబాద్ చుట్టూనే సాగింది తప్ప దేశం దాటలేదు. కానీ వివాహం అనంతరం మాత్రం కుటుంబంతో తరుచూ విదేశాలకు వెకేషన్లకు వెళ్లడం పరిపాటి అయింది.








































