Advertisement

బాలయ్య మోకాలి సర్జరీ సక్సెస్

Balakrishna Undergoes Surgery


నందమూరి బాలకృష్ణ రెండురోజుల క్రితం NBK 111 షూటింగ్ లో గాయపడిన విషయం తెలిసిందే. కాకినాడ పోర్ట్ లో జరుగుతున్న NBK 111 షూటింగ్ లో బాలయ్య ఓ యాక్షన్ సీక్వెన్స్ లో నటిస్తుండగా.. కాలు జారి పడిపోవడంతో మోకాలికి గాయమైంది. ఆతర్వాత కాకినాడ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స తీసుకుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కి వచ్చేసారు.

హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో నిన్న బుధవారం టెస్ట్ లు చేయించుకున్న బాలకృష్ణకు మోకాలి చుట్టూ కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతోపాటు వాపును ఉంది అని, మోకాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు గా తెలిపిన AIG వైద్యులు మోకాలికి సర్జరీ పడుతుంది అని చెప్పగా..

ఈరోజు గురువారం బాలయ్యకు మోకాలి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు AIG ఆసుప్రతి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం బాలయ్య ఆరోగ్యం నిలకడగా ఉంది అని, నాలుగు వారాల విశ్రాంతి తర్వాత ఆయన యధావిధిగా తమ పని చేసుకోవచ్చని వైద్యులు సూచించినట్లుగా తెలుస్తుంది. 

Balakrishna successfully underwent knee surgery at AIG Hospitals