Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Injury Impact – NBK’s Plans Completely Changed

ఇంజ్యూరీ ఎఫెక్ట్ - NBK ప్లాన్స్ మొత్తం చేంజ్

Injury Impact – NBK’s Plans Completely Changed

 

నందమూరి బాలకృష్ణ గాయం తో ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ AIG ఆసుపత్రిలో బాలయ్య చికిత్స తీసుకుంటున్నారు. NBK 111 సెట్ లో జరిగిన ప్రమాదంలో బాలయ్య మోకాలికి గాయమైంది. దానికి సర్జరీ చెయ్యాలని, తర్వాత బాలకృష్ణ నాలుగు నుంచి ఏడు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు.

దానితో బాలయ్య సినిమాల ప్లాన్స్ అన్ని ఒక్కసారిగా చేంజ్ అయ్యాయి. NBK 111 చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ లో విడుదల చేసే ప్లాన్ లో ఉండగా.. ఇప్పుడు బాలయ్య మోకాలి ఇంజ్యూరీ వల్ల అది పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. మరోపక్క కొరటాల శివ తో బాలయ్య మొదలు పెట్టిన NBK 112 చిత్రం ఆగష్టు నుంచి రెగ్యులర్ షూట్ కి వెళ్లాల్సి ఉంది.

కానీ బాలయ్య మోకాలి గాయం వలన కొరటాల మూవీ కూడా నవంబర్ నుంచి రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అంటున్నారు. బాలయ్య కు తగిలిన దెబ్బ వలన ఆయన చెయ్యాల్సిన సినిమాల ప్లాన్స్ అన్ని ఒక్కసారిగా మారిపోయాయి. దీనిని బట్టి NBK 111 2027 కి వెళ్ళిపోతుంది అనేది అర్ధమవుతుంది.
 

Nandamuri Balakrishna