Advertisement

మళ్లీ ఫామ్ లోకి పూజ హెగ్డే ?

Actress Pooja Hegde

 

పూజ హెగ్డే కి మంచి టైమ్ స్టార్ట్ అయ్యినట్లే కనిస్తుంది.. సోషల్ మీడియా టాక్ చూస్తుంటే. నాలుగు పరాజయాలతో రెండేళ్లు ఖాళీగా కూర్చున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే తమిళ సినిమాల్తో రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ కూడా పూజ హెగ్డే ని బాగా డిజప్పాయింట్ చేసింది. అయినా పూజ హెగ్డే కి ఎక్కడో లక్కు ఉంది.

అందుకే వరస ప్రాజెక్ట్స్ అమ్మడు చేతికి వస్తున్నాయి. పూజ హెగ్డే నటించిన జన నాయగన్ చిత్రం విడుదలకు విడుదలైంది. పూజ హగ్దే కి పెద్దగా ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు. కారణం ఆమె సీన్స్ కట్ చేశామని దర్శకుడే డైరెక్ట్ గా చెప్పేసారు. ఇక ఒకటి రెండు ప్రాజెక్ట్ చేతిలో ఉన్న పూజ హెగ్డే పేరు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో వినిపిస్తున్నాయి.

అది తనకు మోనికా సాంగ్ ఛాన్స్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ మరో క్రేజీ ఆఫర్ అమ్మడుకు ఇవ్వబోతున్నట్టుగా టాక్. అల్లు అర్జున్ తో లోకేష్ కనగరాజ్ తెరకెక్కించబోయే చిత్రంలో పూజ హెగ్డే ని హీరోయిన్ గా లాక్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా రవితేజ-శ్రీవిష్ణు కలయికలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ సినిమాలోనూ పూజ హెగ్డే పేరు రవితేజ సరసన వినిపిస్తుంది.

మరి ఈ ప్రాజెక్ట్స్ గనక పూజ హెగ్డే చేతికి వస్తే మళ్లీ పూజ హెగ్డే హవా టాలీవుడ్ లో మొదలైనట్లే. చూద్దాం పూజ హెగ్డే లక్కు ఎలా ఉందొ అనేది.

Pooja Hegde