ఈ హీరోయిన్ కి మళ్లీ నిరాశే !
Disappointment for this heroine once again!
నభా నటేష్ ఈమధ్య కాలంలో ఈ అమ్మడు పేరు నాగబంధం చిత్రంలో బాగా వినిపించడమే కాదు.. నాగబంధం ప్రమోషన్స్ లో నభా నటేష్ చాలా క్యూట్ గా హాట్ గా రెడీ అయ్యి ఆడియన్స్ ను ఆకర్షించింది. నాగబంధం చిత్రంలో అందాలతో పాటుగా అభినయము చూపించిన నభా నటేష్ ఆ సినిమా ప్రమోషన్స్ లో మాత్రం చాలా ఎక్కువ హైలెట్ అయ్యింది.
కారణం ఆ చిత్రంలో ఆడియన్స్ కు తెలిసిన ఫేసుల్లో ఆమె ఒక్కర్తే కాబట్టి. అయితే అందం, గ్లామర్, నటన అన్ని ఉన్నా అమ్మడుకి ఈ మద్యన అదృష్టం కలిసి రావడం లేదు. నాగబంధం చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. ఎన్నో అంచనాలు, హైప్ ఉన్న ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేసింది.
ఆ సినిమాకొచ్చినటాక్ నభా నటేష్ ను మరింత నిరాశపరిచింది. ఈ సినిమా హిట్ అయితే పాన్ ఇండియా లెవల్లో నభా నటేష్ పేరు బాగా వినిపించేది. ఇక ఇప్పుడు ఈఅమ్మడు హోప్స్ అన్ని నిఖిల్ తో నటించిన స్వయంభు పైనే ఉన్నాయి. ఈ చిత్రంలో సంయుక్త తో కలిసి నభా నటేష్ స్క్రీన్ షేర్ చేసుకుంది. అయినా ఈ స్వయంభు ఎప్పుడు విడుదలతుందో అనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే.







































