ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూత


ప్రముఖ నేపథ్య గాయని, దక్షిణ భారత కోకిలగా గుర్తింపు పొందిన ఎస్. జానకి ఈరోజు కన్నుమూశారు. మైసూరులోని అపోలో ఆసుపత్రిలో ఆవిడ తుదిశ్వాస విడిచారు. ఆవిడ వయసు 88 ఏళ్ళు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో ఆవిడ మృతిచెందినట్లుగా తెలుస్తుంది.

1938 ఏప్రిల్ 23న జన్మించిన ఎస్. జానకి, ఆరు దశాబ్దాలకు పైగా మ్యూజిక్ ప్రియులకు సేవలందించారు. 17 భాషల్లో 48 వేలకుపైగా పాటలు ఆలపించిన గానకోకిల జానకి. మధురమైన గాత్రంతో కోట్లాది అభిమానుల మనసు గెలుచుకున్న జానకి, గ్రామీణ జానపదం నుంచి శాస్త్రీయ, మెలోడీ, భక్తి గీతాల వరకు విశేష ప్రతిభ చూపించారు.

భారతీయ సినీ సంగీత రంగానికి ఎస్. జానకి సేవలు చిరస్మరణీయం, ఎస్. జానకి మృతితో భారతీయ సినీ సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది, గానకోకిల ఎస్. జానకికి సినీ, సంగీత ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు.