సస్పెన్స్ కు తెర దించేసిన రామాయణ
Ramayana trailer and first look launch deets
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ విజువల్ వండర్ `రామాయణ` చిత్రంపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. నితీష్ తివారి దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇండియన్ సినిమా నుంచి మొదటి ఐమ్యాక్స్ వెర్షన్ చిత్రంగా హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందుతోంది. కొంత కాలంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా వాటన్నింటికీ మేకర్స్ తెరదించారు.
ట్రైలర్ విడుదల పై సోషల్ మీడియా పుకార్లకు చెక్ పెడుతూ బృందం అధికారికంగా ప్రకటన చేసింది. ఎపిక్ సినిమా ట్రైలర్ లాంచ్ జూలై 24న జరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమా నుల్ని ఆకట్టుకుంటోంది. ఇందులో సీతారామలక్ష్మణులు అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరుతున్న దృశ్యాన్ని చూపించారు.
దీంతో సినిమాపై క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇప్పటికే హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రచారం జరగడంతో? టీజర్..ట్రైలర్ ఎలా ఉంటాయి? అనే ఆసక్తి అంతకంతకు పెరిగిపోతుంది. దీంతో ప్రేక్షకాభిమానులు జులై 24 కోసం ఎదురు చూపులు మొదలు పెట్టారు. సేవ్ ది డేట్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. టీజర్..ట్రైలర్ హైప్ తీసుకొస్తే? సినిమాపై అంచనాలు ఆకాశాన్నే అంటుతాయి.







































