నారా బ్రాహ్మణి కి అరుదైన గుర్తింపు
Rare recognition for Nara Brahmani
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యాపారరంగంలో తన ప్రత్యేకతను చూపుతున్నారు. మంగళగిరి చేనేత వస్త్రాల ప్రమోషన్స్ లో భర్త లోకేష్ తో కలిసి పూజల్లో మంగళగిరి చీరకట్టులో స్పెషల్ గా కనిపించే నారా బ్రాహ్మణి ఇప్పుడొక అరుదైన గుర్తింపు దక్కిందచుకున్నారు.
ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ గా ఎంపికయ్యారు.హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ఫార్చ్యూన్ ఇండియా 100 మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ గా అవార్డు స్వీకరించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా రూపొందించిన 100 మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు.
ఒక పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభ, హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణం, రైతులతో నిర్మించుకున్న నమ్మకం, డైరీ రంగంలో ఆవిష్కరణలతో పాటు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఇందుకు కారణం. ఢిల్లీలో నిర్వహించిన ఫార్చ్యూన్ ఇండియా ‘మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ 2026’ కార్యక్రమంలో బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు.
అవార్డు అందుకున్న నారా బ్రాహ్మణి మాట్లాడుతూ.. హెరిటేజ్ ఫుడ్స్ సక్సెస్‌ఫుల్ జర్నీలో రైతుల పాత్ర మర్చిపోలేనిదని.. వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని, తనకు దక్కిన ఈ అవార్డు రైతులు, హెరిటేజ్ ఫుడ్స్ ఫ్యామిలీకి అంకితమన్నారు.







































