లెనిన్ సక్సెస్ - హీరోయిన్ ఎమోషనల్
Lenin's success – Heroine gets emotional
లెనిన్ హిట్ హీరో అఖిల్-హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. అందుకే సినిమా సక్సెస్ అని తెలిసాక హీరో అఖిల్ ఎమోషనల్ అవుతూ తండ్రి నాగ్ ని హగ్ చేసుకుంటే, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే లెనిన్ సక్సెస్ మీట్లో ఎమోషనల్ అవుతూ కళ్లనీళ్లు పెట్టుకుంది.
గత మూడు సినిమాలుగా నిరాశపరుస్తూ వస్తున్న భాగ్యశ్రీ బోర్సే కి లెనిన్ రిజల్ట్ చాలా ఊరటనిచ్చింది. లెనిన్ కొస్తున్న ఫీడ్ బ్యాక్ చూసుకుని భాగ్యశ్రీ బోర్సే లెనిన్ సక్సెస్ మీట్ లో మట్లాడుతూ.. ఈ రోజు నేను చాలా ఎమోషనల్‌గా ఉన్నాను. అందుకే నా మనసులో ఉన్నది మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఈ రోజు ఇక్కడ ఉండటానికి కారణమైన వ్యక్తి, మా దర్శకుడు మురళి కిశోర్.
దర్శకుడు నాకు భారతి పాత్ర ఇవ్వకపోయి ఉంటే, ఈ రోజు నాకు ఇంత మంచిటి ప్రశంసలు దక్కేవి కావు. నన్ను భారతిగా తెరపై నిలబెట్టినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. గత ఏడాదిన్నరగా నా ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. నేను కెరీర్ లో కిందపడిపోయిన ప్రతిసారీ, నా ఫ్యాన్స్ నాకు పంపిన మెసేజ్‌లు, రీల్స్, వారు చూపిన నిరంతర ప్రోత్సాహమే నన్ను ఈ రోజు ఇక్కడ నిలబెట్టింది అంటూ భాగ్యశ్రీ బోర్సే చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
అంతేకాదు హైదరాబాద్ నా కర్మభూమి. నా చివరి సినిమా కూడా ఇక్కడే(టాలీవుడ్) లోనే చేయాలని కోరుకుంటున్నాను.. అంటూ భాగ్యశ్రీ బోర్సే చెప్పుకొచ్చింది.







































