రెండవ చిత్రాన్ని లాక్ చేసిన రాజ్ వెడ్స్ రాంబాయి!
Raju Weds Rambai director second film gets interesting title`రాజు వెడ్స్ రాంభాయి` వంటి గ్రామీణ ప్రేమకథా చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సైలు కాంపటి.
తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలతో పాటు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. మట్టి వాసనగల కథలు ద దూరమైపోతున్న తరుణంలో స్వచ్ఛమైన ప్రేమ కథను ఆవిష్కరించి ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు.
తాజాగా సైలు తదుపరి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు. `బాబ్లూ ఎక్స్‌ఎల్` అనే ఆసక్తికర టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. ఇందులో కథానాయకుడిగా సుమంత్ ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తొలుత `రాజు వెడ్స్ రాంభాయి` కథను కూడా సుమంత్ ప్రభాస్‌కే ఆఫర్ చేసినప్పటికీ `మేమ్ ఫేమస్` తర్వాత మరో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలో నటించడం ఇష్టం లేక ప్రాజెక్ట్‌ను తిరస్కరించాడు.
కానీ ఈసారి యువ హీరో మెచ్చిన కథ రావడంతో సుమంత్ దిగొచ్చాడు. ఇద్దరు కలయికలో తెరకెక్కనున్న `బబ్లూ ఎక్స్ ఎల్` కూడా తెలంగాణ నేపథ్యంలోనే సాగుతుందని సమాచారం. ఈ చిత్రాన్ని ఏషియన్ సునీల్- పుస్కూర్ రామ్మోహన్ రావు - భరత్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.మొదటి సినిమాతోనే ప్రతిభ చాటుకున్న సైలు కాంపటి ఈసారి సుమంత్ ప్రభాస్‌తో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడని చూడాలని తెలంగాణ సహా ఆంధ్రా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.







































